ఆదర్శనీయం రంగనాథన్‌ జీవితం

ABN , First Publish Date - 2023-08-12T23:18:55+05:30 IST

గ్రంథాలయ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహోన్నతుడు ఎస్‌ఆర్‌ రంగనాథన్‌ అని ఆయన జీవితం ఆదర్శనీయమని రిటైర్డ్‌ ఎంపీడీవో ఎస్‌.చిరంజీవి, గ్రంథాల యాధికారి కాళ్ల రాజు అన్నారు. స్థానిక శాఖాగ్రంథాలయంలో శనివారం ఎస్‌ఆర్‌ రంగనాథన్‌ జయంతి సందర్భంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం, జాతీయ లైబ్రేరియన్స్‌ డే నిర్వ హించారు.

 ఆదర్శనీయం రంగనాథన్‌ జీవితం
పాతపట్నం: రంగనాథన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న చిత్రం

పాతపట్నం: గ్రంథాలయ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహోన్నతుడు ఎస్‌ఆర్‌ రంగనాథన్‌ అని ఆయన జీవితం ఆదర్శనీయమని రిటైర్డ్‌ ఎంపీడీవో ఎస్‌.చిరంజీవి, గ్రంథాల యాధికారి కాళ్ల రాజు అన్నారు. స్థానిక శాఖాగ్రంథాలయంలో శనివారం ఎస్‌ఆర్‌ రంగనాథన్‌ జయంతి సందర్భంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం, జాతీయ లైబ్రేరియన్స్‌ డే నిర్వ హించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పలువురు పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టెక్కలి గ్రంథాలయంలో...

టెక్కలి: స్థానిక శాఖా గ్రంథాలయంలో శనివారం గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్‌ఆర్‌ రంగ నాథన్‌ 131వ జయంతి గ్రంథాలయాధికారి బి.రూపవతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత గ్రంథాలయ అధికారులు టి.వైకుంఠరావు, జి.ప్రసాదరావు, కేబీ సుబ్రమణ్యం, ఎస్‌.రామారావులను గ్రంథాలయ అధికారి దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి జి.భారతి, ఎస్‌.ఉదయ్‌కిరణ్‌, అమ్మన్నమ్మ, తారక్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-12T23:18:55+05:30 IST