చేపల చెరువుల లీజుపై రగడ

ABN , First Publish Date - 2023-03-31T23:50:55+05:30 IST

చేపల చెరువుల లీజు విషయంపై వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

చేపల చెరువుల లీజుపై రగడ
వాగ్వాదం చేసుకుంటున్న వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు :

ఇచ్ఛాపురం: చేపల చెరువుల లీజు విషయంపై వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శుక్రవారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ అధ్యక్షతన మునిసిపల్‌ సాధారణ సమావేశం వాడీవేడిగా జరిగింది. కోమటి, కండ్ర, బంగాళ, ఎర్ర, కృష్ణ చెరువుల్లో చేపలు పెంచి పట్టుకొనే హక్కుకోసం మూడేళ్ల లీజుకాలం 33.34 శాతం పెంచుతూ కౌన్సిల్‌ ఆమోదం కోరారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు గేదెల శేఖర్‌, నారాయణ బెహరా ఆమోదం తెలపగా వైసీపీ కౌన్సిలర్లు వ్యతి రేకించి ఈ అంశాన్ని వాయిదావేయాలని కోరారు. దీంతో రెండు పార్టీల కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇన్‌ల్యాండ్‌ ఫిషర్స్‌మెన్‌ సొసైటీ లోని మత్స్యకారులందరికీ సమన్యాయం జరగాలంటే ఈఅంశాన్ని వాయిదావేయడమే మేలని చైర్‌పర్సన్‌ రాజలక్ష్మి తెలిపారు. వాయిదా వేయాలనుకుంటే ఎందుకు ఎజెండా లోకి తీసుకొచ్చారని కౌన్సిలర్‌ శేఖర్‌ ప్రశ్నించారు. మెజార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకించడంతో ఈ అంశాన్ని వాయిదా వేశారు. ఫఈనెల 17 నుంచి మే 15 వరకు జరగనున్న స్వేచ్ఛా వతి అమ్మవారి సంబరాలు పురస్కరించుకుని అదనంగా మరో 50 మంది పారిశుధ్య కార్మికులను నియమించేందుకు కౌన్సిల్‌ ఆమోదించింది. సంబరాల కోసం రెండు ఐదు వేలు లీటర్ల ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేయడానికి నిధులు కేటా యించడానికి ఆమోదించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఫ2023-24 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్‌, వీధిగుత్తలు బహిరంగ వేలంపాటలకు సంబంధించి కౌన్సిల్‌ ఆమోదించింది.

Updated Date - 2023-03-31T23:50:55+05:30 IST