రచయిత ‘బద్రి’కి సత్కారం

ABN , First Publish Date - 2023-03-19T23:50:37+05:30 IST

హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగ ణంలో జరిగిన తెలుగు జానపద సాహిత్య పరిషత్‌ స్వర్ణోత్సవాల్లో రచయిత బద్రి కూర్మా రావును సత్కరించారు.

రచయిత ‘బద్రి’కి సత్కారం

పలాసరూరల్‌: హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగ ణంలో జరిగిన తెలుగు జానపద సాహిత్య పరిషత్‌ స్వర్ణోత్సవాల్లో రచయిత బద్రి కూర్మా రావును సత్కరించారు. స్వర్ణో త్సవ ప్రత్యేక సంచికలో బద్రి కూర్మారావు రాసిన గై(గౌ)రమ్మ పాటలు(ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ) ప్రాంతాల తులనాత్మక పరిశీలన వ్యాసం ప్రచురింపబడింది. ఈ నేపథ్యంలో గిడుగు రామ మూర్తి జానపద కళాపీఠం వ్యవ స్థాపకుడు బద్రి కూర్మారావును సంస్థ ప్రతినిధులు సత్కరించారు. ఈ సావనీర్‌ను వర్సిటీ వీసీ, ప్రొఫెసర్‌ తంగెడ కిషన్‌రావు ఆవిష్కరించారని ఆయన తెలిపారు. స్వర్ణోత్సవ సావనీర్‌లో తన రచనకు అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.

Updated Date - 2023-03-19T23:50:37+05:30 IST