సైకో సీఎంకి గుణపాఠం చెప్పాలి

ABN , First Publish Date - 2023-09-25T23:59:27+05:30 IST

రానున్న ఎన్నికల్లో సైకో సీఎం జగన్‌కు గుణపాఠం చెప్పా లని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పిలుపు నిచ్చారు. సోమవారం ఆమదాల వలస పట్టణంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ ముద్రించిన బాబుతో నేను అన్న పత్రాలను దుకాణదారు లకు పంపిణీ చేశారు.

సైకో సీఎంకి గుణపాఠం చెప్పాలి
ఎచ్చెర్లలో ఒంటి కాళ్లపై నిల్చొని నిరసన తెలుపుతున్న టీడీపీ, టీఎన్‌టీయూసీ నేతలు

సరుబుజ్జిలి (ఆమదాలవలస), సెప్టెంబరు 25: రానున్న ఎన్నికల్లో సైకో సీఎం జగన్‌కు గుణపాఠం చెప్పా లని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పిలుపు నిచ్చారు. సోమవారం ఆమదాల వలస పట్టణంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ ముద్రించిన బాబుతో నేను అన్న పత్రాలను దుకాణదారు లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమించి సైకో సీఎం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజలు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీత, పార్టీ పట్టణాధ్యక్షుడు ఎస్‌.మురళీధర రావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య మంత్రి జగన్‌ నిత్యం కక్షసాధింపు పాలనతోనే కాలం గడుపుతున్నా రని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపిం చారు. సోమవారం ఆమదాలవలసలో టీడీపీ కస్టర్‌, యూని ట్‌ ఇన్‌చార్జిలు రిలే దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్‌, శివ్వాల సూర్య నారాయణ, దవళ సింహాచలం, కొమనాపల్లి రవికుమార్‌, మెట్ట సుజాత, సంపత్‌రావు, మురళీధరరావు పాల్గొన్నారు.
అర్ధనగ్న ప్రదర్శన
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం ఆమదాలవలసలో ఆ పార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆమదాల వలస ప్లైఓవర్‌ నుంచి వీధుల్లో నిర్వహించిన అర్ధనగ్న ప్రదర్శనలో మాజీ జడ్పీటీసీ ఆనెపు రామకృష్ణ, నాయకులు మొదలవలస రమేష్‌, తమ్మినేని విద్యాసాగర్‌, నూకరాజు, నందివాడ గోవిందరావు, గణపతిరావు, అన్నెపు భాస్కరరావు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు: లక్ష్మీదేవి
అరసవల్లి: వైసీపీ పాలనలో అన్యాయం, అధర్మం విల యతాండవం చేస్తున్నాయని, చంద్రబాబు అక్రమ అరెస్టు దీనికి పరాకాష్టగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జి గుండ లక్ష్మీదేవి అన్నారు. సోమవారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ 13వ రోజు సోమవారం నిరాహారదీక్షను చేపట్టారు. టీడీపీ నేయకులు మోకాళ్లపై కూర్చుని, నేలపై పడుకుని, ప్లకార్డులతో ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, పార్టీ నగర అధ్యక్షుడు మాదా రపు వెంకటేష్‌, నాయకులు తోణంగి వెంకన్న యాదవ్‌, ముద్డాడ కృష్ణ మూర్తి, ఎస్వీ రమణ మాదిగ, వెంకటేష్‌, బరాటం ఉద యశంకర గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఇచ్ఛా పురం: కక్ష సాధింపు చర్య ల్లో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి వైసీపీ ప్రభు త్వం వేధిస్తోం దని టీడీపీ నాయకులు ఆరో పించారు. సోమవారం ఇచ్ఛాపురం మునిసిపాలిటీ, మండల నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్య దర్శి ఆశి లీలారాణి, నియోజకవర్గ తెలుగు యువ త అధ్యక్షుడు కాళ్ల జయదేవ్‌, ఎన్‌.కోటి, జి.శేఖర్‌, నారాయణ బెహరా, ఎన్‌.మోహన్‌, ఎం.వైకుంఠరావు, జి.కేశవ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీ, కొండా శంకరరెడ్డి, పత్రి తవిటయ్య, నందికి జాని, కొరాయి ధర్మరాజు, జగదీష్‌ యాదవ్‌, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, డి.కామేష్‌, రాజు పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని టీడీపీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కోరారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన రిలే దీక్ష లు కొనసాగుతున్నాయి. సోమవారం పార్టీకి చెందిన చేనే త విభాగం ప్రతినిధులు పాల్గొని నిరసన తెలిపారు. కార్యక్రమం లో చేనేత నాయకులు కూశెట్టి కాంతారావు, పప్పు కృష్ణారావు, మెండి రాము, కొన్న రామచంద్రరావు, దూబ సూరి బాబు, దశరథ, టీడీపీ నేతలు బోయిన రమేష్‌, బగాది శేషగిరి, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, తర్ర రామకృష్ణ, గొండు లక్ష్మణరావు, కర్రి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయండి: బగ్గు
నరసన్నపేట: సైకో పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఇంటింటికీ వెళ్లి తెలియజేయాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులపై ఉందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి అన్నారు. సోమవారం నిర్వహించిన రిలేదీక్షలో యా దవ సాధికారిత సమితి సభ్యులు పాల్గొని నిరసన తెలి పారు. కార్యక్రమంలో నియోజవర్గ పార్టీ పరిశీలకుడు మహం తి చిన్నంనాయుడు, యాదవ సాధకారిత సమితి నియో జకవర్గ కన్వీనర్‌ ఇప్పిలి జగదీశ్వర రావు, టీడీపీ నాయకులు శిమ్మ చంద్రశేఖర్‌, అడపా చంద్ర శేఖర్‌, కింజరాపు రామా రావు, గొద్దు చిట్టిబాబు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతి రేకంగా ఎచ్చెర్లలో సోమవారం టీఎన్‌టీయూసీ ఆధ్వ ర్యంలో ఒంటి కాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. కార్యక్ర మంలో టీడీపీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వ రరావు, మాజీ జడ్పీటీసీ గొర్లె లక్ష్మణరావు, విజయనగరం పార్లమెం టరీ పార్టీ టీఎన్‌టీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు విక్రం జగన్నాథం, రౌతు శ్రీనివాసరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ అధ్యక్షుడు శిల్లా శ్రీనివాసరావు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు వినతిపత్రం
అరసవల్లి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ, ప్రభుత్వం వెంటనే కేసు ఉపసంహరించుకుని ఆయనను విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌కు ఆ పార్టీ ఎస్సీ సెల్‌ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం జడ్పీలో జరిగిన స్పందనలో వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడ పీఎంజే బాబు విలే కరులతో మాట్లాడుతూ.. సాక్ష్యాధారాలు లేకుండా, ఇంకా సేకరించే పనిలో ఉన్నామని చెబుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌లో ఉంచడం దారుణమన్నారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్ష, కార్యదర్శులు మట్టా పురు షోత్తం, గోర సురేష్‌, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి ఎస్‌వీ రమణ మాదిగ, ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు కల్యాణ వెంకటరావు, సింహాచలం, కవ్వాడి సుశీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:59:27+05:30 IST