రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన

ABN , First Publish Date - 2023-07-22T23:33:52+05:30 IST

నివగాం-గులుమూరు మార్గంలో రోడ్డుపై ఏర్పడిన గోతుల్లో శనివారం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు దారుణంగా ఉండడంతో మద నాపురం, ఆకులతంపర, సోమరాజపురం, ఆర్‌కే పురం, శోభనాపురం, అంగూరు గ్రామాల విద్యా ర్థులు, ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడు తున్నారన్నారు.

 రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన
ోడ్డుపై నాట్లు వేస్తున్న కలమట రమణ తదితరులు

కొత్తూరు: నివగాం-గులుమూరు మార్గంలో రోడ్డుపై ఏర్పడిన గోతుల్లో శనివారం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు దారుణంగా ఉండడంతో మద నాపురం, ఆకులతంపర, సోమరాజపురం, ఆర్‌కే పురం, శోభనాపురం, అంగూరు గ్రామాల విద్యా ర్థులు, ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడు తున్నారన్నారు. పరిమితికి మించి ఇసుక లారీలు వెళుతున్నందున రోడ్డు పాడవుతున్నాయని అయి నా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించక పోవడం దారుణమ న్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి నిరసన తెలిజేశారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని..

కొత్తూరు: నివగాం ఇసుక ర్యాంప్‌ వద్ద ఇసుక అక్రమ రవాణాను మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి శనివారం అడ్డుకున్నారు. ఇసుక అక్రమ రవాణా, డంపింగ్‌ల ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని బూటకపు మాటలు చెప్పి పగలు రాత్రీ తేడా లేకుండా డంపింగ్‌ జరుగు తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక అక్రమ తవ్వకాలతో నివగాం వంతెన, పంట పొలాలు, గ్రామాలు తీవ్రంగా నష్ట పోతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక డంపింగ్‌కు అను మతులు లేక పోయినా 20 ఎకరాల్లో ఇసుక నిలువ ఉంచి ఎమ్మెల్యే రెడ్డి శాంతి అమ్ముకున్నారని ఆరోపించారు. అక్రమ రవాణా వల్ల నివగాం, మదనాపురం, సోమరాజపురం, అంగూరు గ్రామాలు మునిగిపోయే ప్రమాదముందన్నారు.

)

Updated Date - 2023-07-22T23:33:52+05:30 IST