రోడ్డు గోతుల్లో వరి నాట్లు వేసి నిరసన

ABN , First Publish Date - 2023-07-27T23:45:26+05:30 IST

పలాస నుంచి టెక్కలిపట్నం వయా పర్లాకిమిడి మార్గంలో వీరభద్రాపురం వద్ద రోడ్డుపై భారీ గోతులు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్లుగా ఎటువంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో గురువారం టీడీపీ నేతలు ఆ గోతుల్లో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.

రోడ్డు గోతుల్లో వరి నాట్లు వేసి నిరసన
రోడ్డు గోతుల్లో వరి నాట్లు వేసి నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

పలాసరూరల్‌, జూలై 27: పలాస నుంచి టెక్కలిపట్నం వయా పర్లాకిమిడి మార్గంలో వీరభద్రాపురం వద్ద రోడ్డుపై భారీ గోతులు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్లుగా ఎటువంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో గురువారం టీడీపీ నేతలు ఆ గోతుల్లో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఆ పార్టీ మండల కార్యదర్శి దువ్వాడ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో నేతలు ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుం టాయని, రోడ్డు మరమ్మ తులు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ప్రయాణికులు తెలిపారు. రోడ్డు దారుణంగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకమని వారు పేర్కొన్నారు. తక్షణం తగు చర్యలు తీసుకుని ప్రమా దాలను నివారించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొర్ల విష్ణు చౌదరి, అవుగాన దశరథ, కొర్ల మాధవయ్య, హేమంత్‌ పాల్గొన్నారు.

చేపలు పడుతూ...

బూర్జ: కొల్లివలస జంక్షన్‌ వద్ద శ్రీకాకుళం-పాలకొండ రోడ్డు చెరువులా మారడం తో జనసేన పార్టీ నాయకులు గురువారం వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పార్టీకి చెందిన కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, కొల్ల జయరాం, విక్రమ్‌ ఆధ్వర్యంలో రోడ్డుపై ఉన్న నీటిలో బైఠాయించి, చేపలు పడుతూ ఆందోళన చేపట్టారు. 15 రోజుల్లో రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే పార్టీ తరఫున పనులు చేస్తామన్నారు. నిరసనలో పార్టీ నాయకులు సేపాన రమేష్‌, పొట్నూరు ప్రసాద్‌, మీసాల జోగినాయుడు, రమేష్‌, గణబాబు, వినోద్‌ తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - 2023-07-27T23:45:26+05:30 IST