‘గిరిజనేతరుల నుంచి భూములను రక్షించండి’

ABN , First Publish Date - 2023-05-25T23:51:16+05:30 IST

గిరిజనేతరుల నుంచి తమ భూములను రక్షించి న్యాయం చేయాలని మందస మండలంలోని పుట్టూరు గ్రామానికి చెందిన గిరిజనులు కోరారు. ఈ మేరకు గురువారం పలాసలో ఆర్డీవో టి.సీతారామమూర్తికి వినతిప త్రం అందజేశారు. 1984 నుంచి ప్రభుత్వాలు సర్వేనెంబరు 42/1 నుంచి 20 వరకూ గల ప్రభుత్వభూములను గిరిజన కుటుంబాలకు డీపట్టాలుగా పంపిణీ చేసినట్లు తెలిపారు.

‘గిరిజనేతరుల నుంచి భూములను రక్షించండి’

పలాస రూరల్‌: గిరిజనేతరుల నుంచి తమ భూములను రక్షించి న్యాయం చేయాలని మందస మండలంలోని పుట్టూరు గ్రామానికి చెందిన గిరిజనులు కోరారు. ఈ మేరకు గురువారం పలాసలో ఆర్డీవో టి.సీతారామమూర్తికి వినతిప త్రం అందజేశారు. 1984 నుంచి ప్రభుత్వాలు సర్వేనెంబరు 42/1 నుంచి 20 వరకూ గల ప్రభుత్వభూములను గిరిజన కుటుంబాలకు డీపట్టాలుగా పంపిణీ చేసినట్లు తెలిపారు. తర్వాత కొత్తపల్లికిచెందిన కొందరు తమ భూములను ఆక్రమించుకో వాలని ప్రయత్నిస్తుండడంతో రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బాధితుల తోపాటు రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, గిరిజన, సీఐటీయూ నాయకులు ఎస్‌.ధర్మారావు, నవీన్‌, కె.సుభాష్‌, కె.బాబూరావు, కృష్ణ, ఎన్‌.గణపతి, గోపినాథ్‌, జానకి, బాలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T23:51:16+05:30 IST