Share News

హామీలు నెరవేర్చాల్సిందే

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:00 AM

‘సమస్యలు పరిష్కరించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే’నని సమగ్రశిక్ష ఉద్యోగులు, సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జ్యోతిబాపూలే పార్కువద్ద ధర్నా కొనసాగిస్తున్నారు.

హామీలు నెరవేర్చాల్సిందే
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

- సమగ్రశిక్ష ఉద్యోగుల డిమాండ్‌

శ్రీకాకుళం/ కలెక్టరేట్‌, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘సమస్యలు పరిష్కరించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే’నని సమగ్రశిక్ష ఉద్యోగులు, సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జ్యోతిబాపూలే పార్కువద్ద ధర్నా కొనసాగిస్తున్నారు. రెండోరోజు గురువారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు చౌదరి రవీంద్ర, ఎస్‌.కిషోర్‌కుమార్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబూరావు, శ్రీరామ్మూర్తి, సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు శిబిరాన్ని సందర్శించి.. వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా.. పీఆర్సీలు అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష యూనియన్‌ నాయకులు పి.తవిటినాయుడు, ధనుంజయరావు, జె.శ్రీనివాసరావు, ఎం.పోతయ్య, ఏ.అరుంధతి, జి.విజయలక్ష్మి, సీహెచ్‌ శైలజ పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 12:00 AM