అధికారాలు లేక పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
ABN , First Publish Date - 2023-12-11T00:14:17+05:30 IST
పంచాయతీలకు నిధులు లేక, సర్పం చ్‌లకు అధికారాలు లేక ఈ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని ఉమ్మడి శ్రీకా కుళం జిల్లాల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ అన్నారు. ఆదివారం రాంపురం, నారాయణ వలస గ్రామాల్లో ప్రజల నుంచి సమ స్యలను తెలుసుకున్నారు.
నందిగాం/కోటబొమ్మాళి: పంచాయతీలకు నిధులు లేక, సర్పం చ్‌లకు అధికారాలు లేక ఈ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని ఉమ్మడి శ్రీకా కుళం జిల్లాల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ అన్నారు. ఆదివారం రాంపురం, నారాయణ వలస గ్రామాల్లో ప్రజల నుంచి సమ స్యలను తెలుసుకున్నారు. సర్పంచ్ పినకాన జోగారావు, టీడీపీ మండల అధ్యక్షుడు పిన కాన అజయ్‌కుమార్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయి తద్వారా వ్యవస్థ నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లోని సమస్యలను త్వరలో జరగనున్న సర్పంచ్‌ల సదస్సులో చర్చిస్తామన్నారు. మాజీ సర్పంచ్‌గొద్దు శోభారాణి పాల్గొన్నారు.