జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌కు పోలవరం విద్యార్థులు

ABN , First Publish Date - 2023-09-22T23:37:55+05:30 IST

జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు పోలవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం పి.విలియమ్స్‌ తెలిపారు.

 జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌కు పోలవరం విద్యార్థులు

టెక్కలి రూరల్‌: జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు పోలవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం పి.విలియమ్స్‌ తెలిపారు. కోటబొమ్మాళి మండలం కురుడులో జరిగిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీ ల్లో అండర్‌-14,17 విభాగాల్లో త్రోబాల్‌ పోటీల్లో కె.షన్ముఖ, వై.కార్తీక్‌, బి.నవదీప్‌, జి.జశ్వంత్‌, ఆర్‌.డిల్లేశ్వరి, యోగా పోటీల్లో కె.అభిషేక్‌, ఎల్‌.శ్రీకాంత్‌, టి.ప్రదీప్‌, ఎ.వరుణ్‌ కుమార్‌ ప్రతిభ కనబరిచారన్నారు. వీరిని హెచ్‌ఎంతోపాటు పీఈటీ జగదీష్‌, యోగా శిక్షకుడు పి.అనిల్‌, ఉపాధ్యాయులు శుక్రవారం అభి నం దించారు.

పాతపట్నం: స్థానిక మినీ స్టేడియంలో ఏపీ మోడల్‌ స్కూల్‌ సారధ్యంలో స్కూల్‌గేమ్‌ ఫెడరే షన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. అండర్‌-14, 17 విభాగాల్లో బాలురకు కబడ్డీ, ఖోఖో, షార్ట్‌పుట్‌, టెన్నీకాయిట్‌, యోగా త్రోబాల్‌, అథ్లె టిక్స్‌ పోటీలు నిర్వహించి క్రీడాకారుల ఎంపిక చేసినట్లు పీడీ యెన్ని శేఖర్‌బాబు తెలిపారు. వివిధ పాఠశాలల నుంచి సుమారు 500 మంది క్రీడా కారులు పాల్గొన్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ కేవీ రత్నకుమారి తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

పలాస: నియోజకవర్గస్థాయి కబడ్డీ, ఖోఖో క్రీడల్లో అండర్‌-14, 17 విభాగాల్లో క్రీడా కారుల ఎంపిక శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో నిర్వహించారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కన్వీనర్‌ పి.తవిటయ్య ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక ప్రక్రియను హెచ్‌ఎం దాశరధి ప్రారంభించారు. ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థుల ను నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో పీఈటీలు పద్మలోచనరావు, ఎస్‌.రామారావు, పి.గజేంద్రరావు, జోగారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:37:55+05:30 IST