అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-09-22T23:50:16+05:30 IST
చాపర గ్రామానికి చెందిన గేదెల షన్ముఖ రావు (38) అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి మృతి చెందినట్టు ఎస్‌ఐ టి.రాజేష్ తెలిపారు.
మెళియాపుట్టి, సెప్టెంబరు 22: చాపర గ్రామానికి చెందిన గేదెల షన్ముఖ రావు (38) అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి మృతి చెందినట్టు ఎస్‌ఐ టి.రాజేష్ తెలిపారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో ఒంటరిగా ఉంటున్న షన్ముఖరావు మద్యానికి బాసినయ్యాడని, తరచూ కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నా యి. అయితే ఏం జరిగిందో తెలియదు కాని గురువారం రాత్రి తన ఇంటిలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు వెంటనే 108 వాహనంలో టెక్కలి జిల్లా అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. షన్ముఖరావ తండ్రి భీమారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.