చిరుజల్లులతో రైతుల్లో అలజడి
ABN , First Publish Date - 2023-11-21T23:48:15+05:30 IST
వాతా వరణంలో వచ్చిన మార్పు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పంట చేతికి వచ్చే సమ యంలో చిరు జల్లులు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకొనేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

జి.సిగడాం/సరుబుజ్జిలి, నవంబరు 21: వాతా వరణంలో వచ్చిన మార్పు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పంట చేతికి వచ్చే సమ యంలో చిరు జల్లులు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకొనేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జి.సిగడాం మండలం లోని పెంట, నాగుల వలస, సీతంపేట, మానంపేట, గేదె లపేట, సంతవురిటి, ఆనందపురం, పాలఖం డ్యాం, మెట్టవలస, జి.సిగడాం, బాతువ, తదితర గ్రామాలు, ఆమదాలవలస, సరుబుజ్జిలి మండల పరిధిలో పలు గ్రామాల్లో ఇప్పటికే వరి కోతలు చేప ట్టారు. అయితే, సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం అడపా దడపా కురిసిన చిరు జల్లులకు పలు చోట్ల పంట తడిసి పోయింది. ధాన్యం రంగు మారుతుందన్న భయంతో పనలను పొలాల గట్ల మీద ఆరబెడు తున్నారు. మరి కొందరు రైతులు కోతలను ఆపే శారు. ఇప్పటికే కోసిన పంటలను కుప్పలుగా పెడు తున్నారు.