డిపాజిట్లను చెల్లించండి
ABN , First Publish Date - 2023-12-11T00:16:47+05:30 IST
అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని డిపాజిటర్లు, ఏజెంట్ల అసోసి యేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయసింహ, రాష్ట్ర మమాళా కార్యదర్శి ఆరుద్రమ్మ డిమాండ్ చేశారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ జిల్లా నాయకుడు చాపర వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం బాధి తులు, ఏజెంట్లు నిరసన దీక్ష చేపట్టారు.
కాశీబుగ్గ: అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని డిపాజిటర్లు, ఏజెంట్ల అసోసి యేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయసింహ, రాష్ట్ర మమాళా కార్యదర్శి ఆరుద్రమ్మ డిమాండ్ చేశారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ జిల్లా నాయకుడు చాపర వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం బాధి తులు, ఏజెంట్లు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి డిపాజిట్లు చేశారన్నారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడడంతో పాటు డిపాజిట్ మొత్తాన్ని సత్వరం అందజేయాలన్నారు. బాధితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో రమేష్ పాత్రో, శ్రీనివాస్ పాత్రో, చాపర సుందర్‌లాల్, మాధవరావు, అజయ్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.