బకాయి వేతనాలు చెల్లించండి

ABN , First Publish Date - 2023-09-19T23:58:02+05:30 IST

సర్వశిక్షాఅభియాన్‌లో పనిచేస్తున్న మాకు బకాయిలతో పాటు సకాలంలో వేతనాలు అందించా లని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. సుమారు మూడు నెలల నుంచి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక విద్యాశాఖ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపారు.

బకాయి వేతనాలు చెల్లించండి
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు

హిరమండలం: సర్వశిక్షాఅభియాన్‌లో పనిచేస్తున్న మాకు బకాయిలతో పాటు సకాలంలో వేతనాలు అందించా లని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. సుమారు మూడు నెలల నుంచి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక విద్యాశాఖ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. విద్యాశాఖలో ప్రభుత్వం పెంచిన పథకాల కార ణంగా మాపై పనిభారం పెరుగుతున్నప్పటికీ సకాలంలో వేతనాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించుకునేం దుకు అవస్థలు పడుతున్నామన్నారు. గడచిన నాలుగున్న రేళ్లుగా ఒక్క పైసా వేతనం పెంచలేదన్నారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఆర్‌ ఎంటీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు టి.ధనుంజయరావు, కె.చంద్ర రావు, బి.గోవిందరావు, పి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-19T23:58:02+05:30 IST