పారా లీగల్ వలంటీర్లు ఉచిత సేవలందించాలి
ABN , First Publish Date - 2023-11-22T00:11:14+05:30 IST
YY

అరసవల్లి: పారా లీగల్ వాలం టీర్లు ఉచితంగా న్యాయ సేవలు అం దించాలని జిల్లా ప్రధాన న్యాయా ధికారి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు జేఏ మౌలానా కోరారు. మంగళవారం జిల్లా కోర్టులో న్యాయ సేవా సదన్‌లో పారా లీగల్ వాలం టీర్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్.సన్యా సినాయుడు, న్యాయవాది అన్నెపు భువనేశ్వరరావు ప్రాథమిక హక్కులు, విధులు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలా స, పాతపట్నం, కోటబొమ్మాళి, నరసన్నపేట, పాలకొండ, రాజాం, సోంపేట, టెక్కలి, కొత్తూరు, పొందూరు చెందిన పారాలీగల్ వాలంటీర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు.