ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-04-03T23:42:08+05:30 IST

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జిల్లాలోని టెక్కలి, శ్రీకాకుళం డివిజన్‌ కేంద్రాల్లో సోమవారం ప్రారంభమయ్యాయి. టెక్కలిలో ఆరు, శ్రీకాకుళంలో ఏడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను ఆ విభా గం జాయింట్‌ డైరెక్టర్‌ విజయభాస్కర్‌, జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆలీఖాన్‌ పరిశీలించారు.

  ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ప్రారంభం

టెక్కలి రూరల్‌: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జిల్లాలోని టెక్కలి, శ్రీకాకుళం డివిజన్‌ కేంద్రాల్లో సోమవారం ప్రారంభమయ్యాయి. టెక్కలిలో ఆరు, శ్రీకాకుళంలో ఏడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను ఆ విభా గం జాయింట్‌ డైరెక్టర్‌ విజయభాస్కర్‌, జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆలీఖాన్‌ పరిశీలించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరిగాయి. ఇంటర్మీ డియట్‌కు 1500 మంది విద్యార్థులకు గాను 121 మంది గైర్హాజరు కాగా పదో తరగతి పరీక్షకు 894 మంది విద్యార్థులకు గాను 114 మంది గైర్హాజరైనట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.

Updated Date - 2023-04-03T23:42:08+05:30 IST