నేటి నుంచి ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు
ABN , First Publish Date - 2023-04-03T00:16:55+05:30 IST
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఇంటర్మీడియట్, టెన్త్ ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లాలోని టెక్కలి, శ్రీకాకుళం డివిజన్ కేంద్రాల పరిధిలో ఈ పరీక్షలు జరగ నున్నాయి. టెక్కలిలో ఆరు, శ్రీకాకుళం లో ఏడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతికి 1,023 మంది, ఇంటర్మీడి యట్‌కు 1,727 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఓపెన్ స్కూల్ విభాగం అధికారులు పరీక్షలకు ఏర్పాట్లు చేశారు.
టెక్కలి రూరల్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఇంటర్మీడియట్, టెన్త్ ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లాలోని టెక్కలి, శ్రీకాకుళం డివిజన్ కేంద్రాల పరిధిలో ఈ పరీక్షలు జరగ నున్నాయి. టెక్కలిలో ఆరు, శ్రీకాకుళం లో ఏడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతికి 1,023 మంది, ఇంటర్మీడి యట్‌కు 1,727 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఓపెన్ స్కూల్ విభాగం అధికారులు పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి 16వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 నుంచిసాయంత్రం 5 గంటల వరకు ఆయా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు జాయింట్ డైరెక్టర్ విజయ భాస్కర్ జిల్లా పరీక్షల పరిశీలకులుగా వ్యవహరించను న్నారు. జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా అసిస్టెంట్ కమీషనర్ ఆలీఖాన్ తెలిపారు.