Share News

మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:37 PM

మనస్తాపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బలిజేపల్లివారి వీధిలో నివసిస్తున్న కొల్లి వేణుగోపాలరావు (52) అనే వ్యక్తి ఓ కారు యజమాని వద్ద డ్రైవర్‌ పని చేస్తున్నాడు.

మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య

శ్రీకాకుళం క్రైం: మనస్తాపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బలిజేపల్లివారి వీధిలో నివసిస్తున్న కొల్లి వేణుగోపాలరావు (52) అనే వ్యక్తి ఓ కారు యజమాని వద్ద డ్రైవర్‌ పని చేస్తున్నాడు. ఇతనికి మొదటిభార్యతో విడాకులు కావడంతో కొల్లి కుమారి అనే మహిళతో పరిచయం ఏర్పడి ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వేణుగోపాల్‌కు మద్యం అలవాటు ఉంది. ప్రతీరోజు తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. దీంతో కుమారి.. చేపల వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని వేరేగా ఉంటుంది. భార్య దూరం కావడంతో వేణు గోపాల్‌ మద్యానికి మరింత బానిసై మనస్తాపంతో శనివారం తన ఇంట్లో హుక్కుకు చీర కట్టి ఉరేసుకున్నాడు. కారు యజమాని కన్నబాబు శనివారం ఎంత ఫోన్‌ చేసినా వేణుగోపాల్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో భార్య కుమారికి ఫోన్‌ చేశాడు. దీంతో ఆమె తన స్నేహితురాలైన కృష్ణవేణితో కలిసి ఇంటికి వెళ్లి చూడగా వేణుగోపాల్‌ ఉరివేసుకుని కనిపించాడు. తమ్ముడు సతీష్‌ ద్వారా అత్తమా మలకు సమాచారం అందించారు. అలాగే టు టౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ కె.లక్ష్మి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

కిడ్నీ వ్యాధితో సర్పంచ్‌ మృతి

ఇచ్ఛాపురం రూరల్‌: బొడ్డబడ పం చాయతీ సర్పంచ్‌ రఘునాథ పాడి(55) కిడ్నీ వ్యాధితో ఆదివా రం మృతి చెందాడు. రఘునాథ గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలసిస్‌ చేయించుకుంటు న్నాడు. అయితే, ఆదివారం ఉదయం ఆరోగ్యం విషమించడం తో మృతి చెందారు. ఆయన కుటుంబానికి మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - Dec 24 , 2023 | 11:37 PM