22న అమరవీరుల స్మారక సభ
ABN , First Publish Date - 2023-11-06T23:13:53+05:30 IST
మర్రిపాడు స్థూపం వద్ద ఈనెల 22న చేపడుతున్న అమరవీరుల 45వ స్మారక సభను విజయవంతం చేయాలని సీపీఐఎంఎల్ నేతలు కోరారు.
వజ్రపుకొత్తూరు: మర్రిపాడు స్థూపం వద్ద ఈనెల 22న చేపడుతున్న అమరవీరుల 45వ స్మారక సభను విజయవంతం చేయాలని సీపీఐఎంఎల్ నేతలు కోరారు. ఈ మేరకు సోమవారం కరపత్రాన్ని విడుదల చేశారు. 1968-78 మధ్య పోరాటాల్లో అమరత్వం పొందిన శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పిస్తామన్నారు. కార్యక్రమంలో సన్నశెట్టి రాజశేఖర్, కుసుమ, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.