Share News

ఓం నమశ్శివాయ

ABN , First Publish Date - 2023-12-11T23:34:08+05:30 IST

కార్తీక మాసం చివరి సోమవారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయాలకు వెళ్లి స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు.

ఓం నమశ్శివాయ
శ్రీముఖలింగేశ్వరుని సేవలో హైకోర్టు ట్రిబ్యునల్‌ న్యాయమూర్తి

(ఆంధ్రజ్యోతి బృందం)
కార్తీక మాసం చివరి సోమవారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయాలకు వెళ్లి స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లన్న ఆలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవదాయ శాఖాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
శ్రీముఖలింగేశ్వరుని సేవలో హైకోర్టు ట్రిబ్యునల్‌ న్యాయమూర్తి
జలుమూరు:
సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వర స్వామిని హైకోర్టు ట్రిబ్యునల్‌ న్యాయమూర్తి జస్టిస్‌ డి.రామలింగేశ్వరరావు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అధికారులు ఈవో పి.ప్రభాకరరావు, అర్చకుల స్వాగతం పలికి వారి గోత్రనామాలతో అభిషేకం చేయించారు. ఆలయ విశిష్టత, శిల్ప కళా సౌందర్యాన్ని అర్చకులు వివరించి శేష వస్త్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో అర్చకులు నారాయణమూర్తి, సింహాచలం, శ్రీకృష్ణ, శివ, అచ్యుత, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-12-12T00:03:26+05:30 IST