Share News

డివైడర్‌ను ఢీకొని ఒడిసా వాసి దుర్మరణం

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:17 AM

బూరగాం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిసాకు చెందిన బదాల్‌ లంక(20) మృతి చెందాడు.

డివైడర్‌ను ఢీకొని ఒడిసా వాసి దుర్మరణం

కంచిలి: బూరగాం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిసాకు చెందిన బదాల్‌ లంక(20) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గంజాం జిల్లా ఛత్రపూర్‌కు చెందిన బదాల్‌ లంక తన స్నేహితుడు నేహార్‌ రౌతుతో కలిసి మహేంద్ర గిరులకు వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో డ్రైవింగ్‌ చేస్తున్న బాదల్‌ లంక అక్కడికక్కడే మృతి చెందగా, నేహార్‌ రౌతు గాయపడ్డాడు. ఇతడిని హైవే అంబులెన్స్‌ సిబ్బంది సోంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై ఎస్‌ఐ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

హిరమండలం: రోడ్డు ప్రమాదానికి గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందు తున్న దిమిలి లక్ష్మణరావు(48) గురువారం రాత్రి మృతి చెందినట్టు పోలీసులు శుక్ర వారం తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 24న హిరమండలం నుంచి గొట్ట గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా బేరేజీ దిగువ గొట్ట గ్రామ సమీ పంలో ద్విచక్రవాహనం అదుపు తప్పిపడిపోవడంతో లక్ష్మణరావు తీవ్రంగా గాయ పడ్డాడు. వెంటనే అతడిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. లక్ష్మణరావు భార్య నీలమ్మ ఇచ్చిన ఫిర్యా దు మేరకు హెచ్‌సీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:17 AM