జీపీఎస్ వద్దు.. ఓపీఎస్ ముద్దు
ABN , First Publish Date - 2023-09-22T23:52:35+05:30 IST
గ్యారెంటెడ్ పెన్షన్ పథకానికి(జీపీఎస్) వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పట్టాయి. శుక్రవారం జీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ.. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య, ఏపీసీపీఎస్‌ఈ, ఏపీటీఎఫ్, పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
- ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
- నల్లబ్యాడ్జీలతో నిరసన
(టెక్కలి/ సంతబొమ్మాళి/ హిరమండలం/ జలుమూరు/ ఇచ్ఛాపురం/ కంచిలి/ గుజరాతీపేట )
గ్యారెంటెడ్ పెన్షన్ పథకానికి(జీపీఎస్) వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పట్టాయి. శుక్రవారం జీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ.. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య, ఏపీసీపీఎస్‌ఈ, ఏపీటీఎఫ్, పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. టెక్కలి, సంతబొమ్మాళి, హిరమండలం, జలుమూరు, ఇచ్ఛాపురం, కంచిలి తదితర ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ మాకొద్దని, ఓపీఎస్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. సీపీఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు దువ్వారి చలపతిరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.నర్సింగరావులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండివైఖరి విడనాడి జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో ఆయా సంఘాల నేతలు గున్న ప్రసాదరావు, సురేష్‌కుమార్, మెండ రామారావు, ఆదినారాయణ, బాడాన రాజు, పెద్దఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు.