Share News

సిబ్బందిలో మార్పురాదా?

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:00 AM

ఆసుపత్రిలో వైద్యాధికారులేరి, సిబ్బంది పనితీరు మారదా అని మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం పలాస ప్రభుత్వాసుపత్రిని రెండో పర్యాయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సిబ్బందిలో మార్పురాదా?
వైద్యాధికారులను ప్రశ్నిస్తున్న మంత్రి అప్పలరాజు

పలాస: ఆసుపత్రిలో వైద్యాధికారులేరి, సిబ్బంది పనితీరు మారదా అని మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం పలాస ప్రభుత్వాసుపత్రిని రెండో పర్యాయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వచ్చిన సమయానికి వైద్యాధికారులు లేకపోవడంతో మండిపడ్డారు. రెండు రోజుల కిందట తనిఖీ చేసిన ఆయన మరలా మరోసారి వచ్చినప్ప టికీ సిబ్బంది పనితీరులో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆసుపత్రిలో రోగులకు సేవలందిం చాలని ఎన్నిసార్లు చెప్పినా వైద్యాధికారుల్లో మార్పు రాకపో వడం దారుణమన్నారు. ఆయన వచ్చే సమయానికి డాక్టర్‌ రఘురాం, అరుణ, గీత మాత్రమే ఉండగా, జిల్లా వైద్యారోగ్య సమావేశానికి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ వెళ్లారని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మిగిలిన వారు సెలవులో ఉన్నారని చెప్పడంతో మంత్రి అసహనం వ్యక్తం చేసారు. ఆయన వెంటన మునిసిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు, ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీష్‌కుమార్‌, వైస్‌చైర్మన్‌ బోర కృష్ణారావు, బెల్లాల శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:00 AM