సాగునీటి కాలువలపై నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2023-08-02T23:40:05+05:30 IST
వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలన కాలంలో సాగునీటి కాలువలపై నిర్లక్ష్యం చూపడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. బుధవారం జిల్లాలోని పలువురు టీడీపీ నాయకులు సాగునీటి కాలువలు, శిథిలావస్థకు చేరిన వసతిగృహాలు, దెబ్బతిన్న రోడ్ల పరిశీలించి, ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలన కాలంలో సాగునీటి కాలువలపై నిర్లక్ష్యం చూపడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. బుధవారం జిల్లాలోని పలువురు టీడీపీ నాయకులు సాగునీటి కాలువలు, శిథిలావస్థకు చేరిన వసతిగృహాలు, దెబ్బతిన్న రోడ్ల పరిశీలించి, ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు.
పాలకుల నిర్లక్ష్యం వల్లే అధ్వానంగా కాలువలు
నరసన్నపేట: వంశధార కాలువలపై షట్టర్లు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వరద నీరు పొలాల్లో నిల్వ ఉండడంతో పంటలు నీటిలో కుళ్లిపోతున్నాయని నరసన్నపేట టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం బొడ్డవానిపేట వద్ద 22ఎల్ కోమర్తి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలకులు నిర్లక్ష్యం వల్ల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో సాగునీటి కాలువల అఽధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు. గుర్రపుడెక్క తొలగించలేదని ఆరోపించారు. నియోజవర్గంలో పిడికెడు మట్టి పనికూడా చేయలేదని ఆరోపించారు. టీడీపీ పాలనలో కాలువల్లో ఏడాదికి ఒక్కసారి పనులు చేసేందుకు నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి జల్లు చంద్రమౌళి పాల్గొన్నారు.
ప్రచారం తప్ప సౌకర్యాలు లేవు
ఎల్.ఎన్.పేట: నాడు-నేడు పఽథకం ద్వారా కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకోవడమే తప్ప విద్యార్థులు చదువుకొనేందుకు సౌకర్యాలు లేవని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆరోపించారు. బుధవారం లక్ష్మీనర్సు పేట ప్రభుత్వ బాలుర వసతి వసతిగృహంలో గదులు పరిశీలించారు. శ్లాబు, గోడలు పెచ్చులూడిపోతున్నా మరమ్మతులు చేపట్టక పోవడంతో ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వసతిగృహంలో విద్యార్థులకు వేరేచోటకు మార్చి మరమ్మతులు చేపట్టాలని కోరారు. కొత్తగా నిర్మించిన బాలికల వసతి గృహం ఎమ్మెల్యే రెడ్డిశాంతి ప్రారంభించి ఏడాది గడుస్తున్నా నిర్వహణపై శ్రద్ధచూపక పోవడం ఆమె చేతకానితనానికి నిదర్శనమని ఆరోపించారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఎస్.కిషోర్‌కుమార్, జి.జగన్మోహనరావు, టి.అప్పన్న, జి.రాము ఉన్నారు.
రోడ్లను విస్మరించిన ప్రభుత్వం
మెళియాపుట్టి: గిరిజన ప్రాంతాల్లోని రోడ్లను వైసీపీ ప్రభుత్వం విస్మరించడంతో గ్రామాలకు వెళ్లేలేని పరిస్థితి నెలకొందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలమట సాగర్ ఆరోపించారు. బుధవారం భరణికోట పంచాయతీ పరిధిలోగల రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారులపై నీరు నిల్వ ఉండడంతో వరి సాట్లు వేసుకోవచ్చని తెలిపారు. గిరిజన సబ్‌ప్లాన్ నిధులు ఇతర కార్పొరేషన్లకు మళ్లించారని ఆరోపించారు. ఆయన వెంట వసంత్ పరమేష్‌రెడ్డి, శ్రీధర్, వసంత్‌రావు, ధర్మరాజ్, సుందరరావు ఉన్నారు.
ఆక్రమించిన భూములన్నీ కక్కిస్తాం..
కాశీబుగ్గ: ఆక్రమించిన భూములన్నీ బయటకు కక్కిస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబురావు తెలిపారు. బుధవారం పలాస-కాశీబుగ్గ మునిసి పాలిటీలోని తొమ్మిదో వార్డు రైల్వేకాలనీలో టీడీపీ మహిళా విభాగం ఆధ్వ ర్యంలో మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ మేని ఫెస్టోపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించేది వైసీపీ పార్టీ అని, కేవలం భూ ఆక్రమణలపై మాత్రమే దృష్టి పెట్టి దోచుకుంటోందని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాలి కృష్ణారావు, నాగరాజు, రవిశంకర్ గుప్తా, కె.సురేష్, నవీన్‌కుమార్, మోహనరావు పాల్గొన్నారు.