పాతపట్నంలో నీలమణిదుర్గ అమ్మవారి ఊరేగింపు
ABN , First Publish Date - 2023-05-25T23:52:54+05:30 IST
:పాతపట్నంలో నీలమణిదుర్గ అమ్మవార్ని గురువారం ఊరేగించారు. ఈ సందర్భంగా నాగవంశపు, మొండి, గొల్లవీఽధుల్లో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వ హించారు.

పాతపట్నం:పాతపట్నంలో నీలమణిదుర్గ అమ్మవార్ని గురువారం ఊరేగించారు. ఈ సందర్భంగా నాగవంశపు, మొండి, గొల్లవీఽధుల్లో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వ హించారు. కాగా నీలమణిదుర్గ ఉత్సవాలు పురస్కరించుకొని గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి కాపువీధి కూడలిలోగల కన్నవారి గృహానికి చేరిన అమ్మవారిని దర్శించు కొన్నారు. ఈసందర్భంగా ఉత్సవ ప్రధానకమిటీ అధ్యక్షుడు లింగాల రవికుమార్ జ్ఞాపి కలు అందజేశారు. వారి వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. కాగా అమ్మ వారి ఉత్సవాలు పురస్కరించుకొని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద గురువారం రాత్రి జాతీయ అవార్డు గ్రహీత రఘునాఽథుని శ్రీకాంత్ ఆధ్వర్యంలో శాస్త్రీయ నాట్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యపదర్శన, విశాఖకు చెందిన మిలీనియం ఆర్కెస్ట్రా బృందం అలపించిన పాటలు అలరించాయి.