మే 21 నుంచి నీలమణి దుర్గ అమ్మవారి పండగ
ABN , First Publish Date - 2023-04-03T00:13:37+05:30 IST
ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ నీలమణిదుర్గ అమ్మవారి పెద్ద పండగల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలని నిర్వాహక ప్రతి నిధులు కోరారు. ఆదివారం బీసీ కమ్యూనిటీ హాల్‌లో పండగల నేపథ్యంలో గ్రామ పెద్దలతో సమావేశం నిర్వ హించారు.
పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ నీలమణిదుర్గ అమ్మవారి పెద్ద పండగల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలని నిర్వాహక ప్రతి నిధులు కోరారు. ఆదివారం బీసీ కమ్యూనిటీ హాల్‌లో పండగల నేపథ్యంలో గ్రామ పెద్దలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రధాన కమిటీతో పాటు ఉప కమిటీ ల ఏర్పాటును దాదాపు పూర్తి చేశారు. మే 21 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పెద్ద పండగల విజయవంతానికి అన్ని కమిటీలు కృషి చేయాలని కోరారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ వ్యాపారులు, గ్రామస్థులను కలిసి పండగల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో లింగాల మధుబాబు, లింగాల రవి, పైల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.