ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నవ్య

ABN , First Publish Date - 2023-02-16T23:58:05+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా రిటర్నింగ్‌ అధికారిగా బి.నవ్య గురువారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు.

 ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నవ్య
రిటర్నింగ్‌ అధికారిగా బాధ్యలు స్వీకరించిన బి. నవ్య

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 16: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా రిటర్నింగ్‌ అధికారిగా బి.నవ్య గురువారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. ఈ నెల 23 వరకు కలెక్టరేట్‌లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. నామినేషన్‌ పత్రాలను కలెక్టర్‌ కార్యాలయంలో పొందవచ్చునని తెలిపారు. సెలవు రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు అందజేయాలన్నారు. 24న నామినేషన్ల పరిశీలన, 27న ఉపసంహరణకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4వరకు పోలింగ్‌, 16న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.

Updated Date - 2023-02-16T23:58:06+05:30 IST