గల్లంతైన విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2023-09-22T00:05:34+05:30 IST
గార మండలం కె.మత్స్యలేశం బీచ్‌లో ఈ నెల 19న గల్లంతైన పదో తరగతి విద్యార్థి కూన ప్రవీణ్ (15) మృతదేహం పోలాకి మండలం రాజారాంపురం తీరంలో గురువారం గుర్తించారు.
పోలాకి, సెప్టెంబరు 21: గార మండలం కె.మత్స్యలేశం బీచ్‌లో ఈ నెల 19న గల్లంతైన పదో తరగతి విద్యార్థి కూన ప్రవీణ్ (15) మృతదేహం పోలాకి మండలం రాజారాంపురం తీరంలో గురువారం గుర్తించారు. పోలాకి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆమదాలవలస మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ప్రవీణ్ మంగళవారం కె.మత్స్యలేశం బీచ్‌లో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. అతడి కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి పోలాకి మండలం రాజారాంపురం తీరానికి అతడి మృతదేహం కొట్టుకువచ్చింది. ఆ గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది చేరుకుని పరిశీలించగా, ఆ మృతదేహం గల్లంతైన ప్రవీణ్‌దిగా గుర్తించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.