Share News

ఇందిరానగర్‌లో భారీ చోరీ

ABN , First Publish Date - 2023-12-04T00:23:37+05:30 IST

పట్టణంలోని ఇందిరానగర్‌ సూర్య అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్థులో ఉన్న దంతవైద్యుడు గురుదేవ్‌ ఇంటిలో ఇద్దరు దొంగలు చోరీకి పాల్ప డ్డారు. 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదును అపహరించినట్లు వైద్యు డు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.

ఇందిరానగర్‌లో భారీ చోరీ
చోరీకి గురైన ఇంటిని పరిశీలిస్తున్న సీఐ ప్రసాద్‌, ఎస్‌ఐ సింహాచలం

- 40తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదు అపహరణ

నరసన్నపేట, డిసెంబరు 3: పట్టణంలోని ఇందిరానగర్‌ సూర్య అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్థులో ఉన్న దంతవైద్యుడు గురుదేవ్‌ ఇంటిలో ఇద్దరు దొంగలు చోరీకి పాల్ప డ్డారు. 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదును అపహరించినట్లు వైద్యు డు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు. పోలీసులు, బాధితుల కథనం మేర కు వివరాలు ఇలా ఉన్నాయి. దంత వైద్యుడు గురుదేవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి శని వారం అపార్టుమెంట్‌లో ఇంటికి తాళాలు వేసి అరుకు విహారయాత్రకు వెళ్లాడు. ఆదివా రం రాత్రి 8గంటలకు తిరిగే వచ్చేసరికి ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువాలోని 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.3లక్షలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని సీఐ ప్రసాదు, ఎస్‌ఐ సింహాచలం పరిశీలించారు. అపార్టుమెంట్‌లో ఉన్న సీసీ కెమెరా లను పరిశీలించగా శనివారం అర్ధరాత్రి 1.32 గంటలకు ఇద్దరు వ్యక్తులు ముఖాలకు మాస్క్‌ ధరించి లోపలకు ప్రవేశించి గురుదేవ్‌ ఇంటిలో చోరీకి పాల్పడినట్లు గుర్తించా రు. ఈ మేరకు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.

Updated Date - 2023-12-04T00:23:39+05:30 IST