వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:14 AM
లింగాలపాడు గ్రామానికి చెందిన చల్ల కల్పన(24) శనివారం ఇంటివద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
జలుమూరు: లింగాలపాడు గ్రామానికి చెందిన చల్ల కల్పన(24) శనివారం ఇంటివద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోటబొమ్మాళి మండలం మధనాపురానికి చెందిన కల్పనకు నాలుగేళ్ల కిందట లింగాలపాడుకి చెందిన చల్ల భుజంగరావుతో వివాహ మైంది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ఏడాది నుంచి కల్పన మానసికంగా బాధపడుతూ అనారోగ్యానికి గురైంది. దీంతో కన్నవారింటి వద్ద ఉండి మందులు వాడింది. వారం రోజుల కిందట లింగాలపాడు వచ్చి మానసిక క్షోభకు గురై ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ గుండీకి చీరకట్టి ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. తల్లి గొద్దు చిన్నమ్మడు ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవపంచనామా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు.