పెట్రోల్‌ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2023-05-27T00:14:54+05:30 IST

గంగాధర పేట గ్రామానికి చెందిన బమ్మిడి లక్ష్మణరావు క్షణికావేశంలో ఒం టిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పం టించుకుని ఆత్మహత్యాయత్నాని కి పాల్పడ్డాడు.

పెట్రోల్‌ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో లక్ష్మణరావు

టెక్కలి రూరల్‌: గంగాధర పేట గ్రామానికి చెందిన బమ్మిడి లక్ష్మణరావు క్షణికావేశంలో ఒం టిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పం టించుకుని ఆత్మహత్యాయత్నాని కి పాల్పడ్డాడు. స్థానికులు తెలి పివ వివరాలిలా ఉన్నాయి.. శుక్ర వారం తన సమీప బంధువు, సోదరుడైన బమ్మిడి లక్ష్మీపతికి, లక్ష్మణరావుకు స్థానిక జడ్పీ రోడ్డు లో గల దుకాణాల వద్ద చిన్నపా టి వాగ్వాదం జరిగింది. దీంతో క్షణికావేశానికి గురైన లక్ష్మణరావు తనతో పాటు తెచ్చుకున్న పెట్రో ల్‌ పోసుకుని నిప్పంటించుకున్నా డు. అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపుచేసి వెంటనే చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం, అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదంలో లక్ష్మణరావు 50శాతం కాలిన గాయాలకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని టెక్కలి పోలీసులకు తెలియజేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.సూర్యారావు తెలిపారు.

Updated Date - 2023-05-27T00:14:54+05:30 IST