నేటినుంచి మల్లికార్జున స్వామి యాత్ర
ABN , First Publish Date - 2023-01-15T00:01:43+05:30 IST
మెట్టవలస ఏకశిలా పర్వతంపై వెలసిన మల్లికార్జునస్వామి యాత్ర సంక్రాంతి సందర్భంగా ఆదివారం నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఏర్పాట్లను పోలీసులు శనివారం పరిశీలించారు.
జి.సిగడాం: మెట్టవలస ఏకశిలా పర్వతంపై వెలసిన మల్లికార్జునస్వామి యాత్ర సంక్రాంతి సందర్భంగా ఆదివారం నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఏర్పాట్లను పోలీసులు శనివారం పరిశీలించారు.
రేపటి నుంచి పైడితల్లి అమ్మవారి జాత ర..
గెడ్డకంచరాంలోని పైడితల్లి అమ్మవారి జాతర సోమవారం నుంచి ప్రారం భంకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవగుప్తాపు సన్యాసిరావు వనంలో వెలసి ఉన్న అమ్మవారిని దర్శించు కొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తారు.
నేటి నుంచి గురమ్మ పేరంటాలు..
లావేరు: గుర్రాలపాలెంలో వెలసిన గురమ్మపేరంటాల జాతర ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిం చనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మూడు రోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.