‘బాబు షూరిటీ, భవిష్యత్‌ గ్యారెంటీ’ని విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2023-08-29T23:46:52+05:30 IST

బాబు షూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాబిన్‌సింగ్‌ టీం ప్రతినిధి అజయ్‌ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయ కులు, కార్యకర్తలు, క్లస్టర్‌, యూనిట్‌, బీఎల్‌ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

 ‘బాబు షూరిటీ, భవిష్యత్‌ గ్యారెంటీ’ని విజయవంతం చేయండి
టెక్కలి: మాట్లాడుతున్న రాబిన్‌సింగ్‌ టీమ్‌ ప్రతినిధి అజయ్‌

రాబిన్‌సింగ్‌ టీం ప్రతినిధి అజయ్‌

టెక్కలి, ఆగస్టు 29: బాబు షూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాబిన్‌సింగ్‌ టీం ప్రతినిధి అజయ్‌ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయ కులు, కార్యకర్తలు, క్లస్టర్‌, యూనిట్‌, బీఎల్‌ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, నాలుగేళ్లలో వైసీపీ ప్రభు త్వం ప్రజలకు చేసిన మోసాన్ని, ధరల పెరుగుదల తదితర అంశా లను ప్రజలకు వివరించా లన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మినీ మేనిఫేస్టోలోని అంశాలపై ప్రజల్లో చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసు నాయుడు, నేత లు బగాది శేషగిరి, బోయిన రమేష్‌, జీరు భీమారావు, తర్ర రామకృష్ణ, వెలమల విజయలక్ష్మి, హను మం తు రామకృష్ణ, లవకుమార్‌, కామేసు, మళ్ల బాలకృష్ణ, వెలమల కామేశ్వరరావు, మెండ దమయంతి, నంబాళ్ల శ్రీనివాస్‌, మామిడి రాము, దల్లి ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలి

పలాస: సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్న ‘బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ’లో ప్రతీ కార్యకర్త భాగస్వామ్యమై విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కోరారు. మంగళవారం స్థానికంగా ఓ కల్యాణ మండపంలో పలాస నియోజ కవర్గ నాయకులు, కార్యకర్తల శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టీడీపీ అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి, వాటికి చంద్ర బాబునాయుడు గ్యారెంటీ అని చాటాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభు త్వ అన్యాయాలు, అరాచకాలపై విస్తృత ప్రచారం చేయాలని కోరా రు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్‌, జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, నేతలు గాలి కృష్ణా రావు, గురిటి సూర్యనారాయణ, మల్లా శ్రీనివాసరావు, బి.దుర్యోధన, రుద్రయ్య, నవీన్‌కుమార్‌, రమణ, నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-29T23:46:52+05:30 IST