నిర్వహణ లేక.. సాగుకు నీరందక
ABN , First Publish Date - 2023-08-02T23:37:28+05:30 IST
మండలంలోని బైరి కాలువకు అనుబంధంగా ఉన్న బూరవెల్లి పిల్లకాలువ సమర్థవంతంగా నిర్వ హించక పోవడంతో శివారు ఆయకట్టు కు ఖరీఫ్‌లో సైతం నీరందడం లేదు. ఈ కాలువ ద్వారా బూరవల్లి, అంబ ళ్లవలస, జోగిపంతులపేట గ్రామాల్లోని 500 ఎకరాలకు నీరందాల్సి ఉంది. సింగుపురం సమీపంలో బైరి మెయిన్ కాలువ నుంచి కింది ఆయకట్టుకు నీరందించేందుకు దశాబ్దాల కిందట పిల్లకాలువలు తవ్వారు. అయితే హైవే సమీపంలో దుకాణాల నిర్వాహకులు వ్యర్థాలు కాలువలో వేయడంతోపాటు పిచ్చిమొక్కలు, డొంకలు, తుప్పలు పెరిగి కాలువను కప్పేశాయి. దీంతో ముందుకు నీరు వెళ్లేందుకు ఆటంకం కలుగుతోంది. అయితే బూరవల్లికి మూడు కిలోమీటర్లు పరిధిలో ఉపాధి పథకం కింద పిల్ల కాలువలో మరమ్మతులు చేసినా బైరి హైవే జంక్షన్ నుంచి 300 మీటర్లు తప్పులు, డొంకలు తొలగించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆయకట్టుకు నీరందకపోవడంతో మళ్ల అబ్బాయినాయుడుతో పాటు రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే జలవనరులశాఖ అధికారులు కాలువలో పిచ్చిమొక్కలు, తప్పులు తొలగించి శివారు ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. కాగా తమ శాఖ దగ్గర నిధులు లేవని, ఉపాధి పథకం కింద కాలువలు మరమ్మతులచేయిస్తున్నామని జలవనరులశాఖ డీఈఈ అనీల్‌కుమార్ ఆంధ్రజ్యోతికి చెప్పారు.
గార: మండలంలోని బైరి కాలువకు అనుబంధంగా ఉన్న బూరవెల్లి పిల్లకాలువ సమర్థవంతంగా నిర్వ హించక పోవడంతో శివారు ఆయకట్టు కు ఖరీఫ్‌లో సైతం నీరందడం లేదు. ఈ కాలువ ద్వారా బూరవల్లి, అంబ ళ్లవలస, జోగిపంతులపేట గ్రామాల్లోని 500 ఎకరాలకు నీరందాల్సి ఉంది. సింగుపురం సమీపంలో బైరి మెయిన్ కాలువ నుంచి కింది ఆయకట్టుకు నీరందించేందుకు దశాబ్దాల కిందట పిల్లకాలువలు తవ్వారు. అయితే హైవే సమీపంలో దుకాణాల నిర్వాహకులు వ్యర్థాలు కాలువలో వేయడంతోపాటు పిచ్చిమొక్కలు, డొంకలు, తుప్పలు పెరిగి కాలువను కప్పేశాయి. దీంతో ముందుకు నీరు వెళ్లేందుకు ఆటంకం కలుగుతోంది. అయితే బూరవల్లికి మూడు కిలోమీటర్లు పరిధిలో ఉపాధి పథకం కింద పిల్ల కాలువలో మరమ్మతులు చేసినా బైరి హైవే జంక్షన్ నుంచి 300 మీటర్లు తప్పులు, డొంకలు తొలగించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆయకట్టుకు నీరందకపోవడంతో మళ్ల అబ్బాయినాయుడుతో పాటు రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే జలవనరులశాఖ అధికారులు కాలువలో పిచ్చిమొక్కలు, తప్పులు తొలగించి శివారు ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. కాగా తమ శాఖ దగ్గర నిధులు లేవని, ఉపాధి పథకం కింద కాలువలు మరమ్మతులచేయిస్తున్నామని జలవనరులశాఖ డీఈఈ అనీల్‌కుమార్ ఆంధ్రజ్యోతికి చెప్పారు.