నలుగురిపై లారీ డ్రైవర్‌ దాడి

ABN , First Publish Date - 2023-09-22T23:42:53+05:30 IST

ఒడిసా రాష్ట్రం ఇల్‌పట్నా ఏరియాకు చెందిన కోళ్ల లక్ష్మణరావు, సునీల్‌కుమార్‌ పాత్రో, దీపక్‌కుమార్‌, సుమంత్‌లపై ఓ లారీడ్రైవర్‌ దాడి చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

నలుగురిపై లారీ డ్రైవర్‌ దాడి

కోటబొమ్మాళి, సెప్టెంబరు 22: ఒడిసా రాష్ట్రం ఇల్‌పట్నా ఏరియాకు చెందిన కోళ్ల లక్ష్మణరావు, సునీల్‌కుమార్‌ పాత్రో, దీపక్‌కుమార్‌, సుమంత్‌లపై ఓ లారీడ్రైవర్‌ దాడి చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ ఆలీ తెలిపిన వివరాల మేరకు.. బాధిత నలుగురు వ్యక్తులు గురువారం విశాఖ నుంచి బరంపురం వెళ్తుండగా, సుబ్బారావుపేట సమీపానికి వచ్చేసరికి, వారి ముం దు వెళ్తున్న ఓ లారీ టైరు పంక్చర్‌ అయింది. ఈ క్రమంలో లారీ టైరు పొర కారుపై పడడంతో అద్దం ధ్వంసం అయింది. దీంతో లారీ డ్రైవర్‌ను వారు నిలదీశారు. జర్జంగి వద్దకు వస్తే పరిహారం ఇస్తానని చెప్పి తీసుకొచ్చి మరో లారీడ్రైవర్‌ సాయంతో కారు అద్దాలు పగలుగొట్టి వారిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడి లక్ష్మణరావు, సునీల్‌కుమార్‌ పాత్రోను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. లారీ నెంబరు ఆధారంగా డ్రైవర్‌ ఒడిసాకు చెందిన శఫియాన్‌ అహమ్మద్‌గా గుర్తించి కేసు నమోదు చేసి, నిందితులను గాలిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-09-22T23:44:55+05:30 IST