‘విద్యుత్తు సంస్కరణలపై ఉద్యమిద్దాం’
ABN , First Publish Date - 2023-08-28T23:55:07+05:30 IST
విద్యుత్తు రంగంలో వినాశకర సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు, సీపీఐ కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్య దర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు.
అరసవల్లి, ఆగస్టు 28: విద్యుత్తు రంగంలో వినాశకర సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద రావు, సీపీఐ కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్య దర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో విద్యుత్ అమరవీరులు రామకృష్ణ, బాలవర్థన్‌రెడ్డి, బాలస్వామిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు విద్యుత్తు చార్జీలను పెంచేది లేదని చెప్పిన జగన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఇప్పటికి ఏడు సార్లు పెంచి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు. ఇప్పుడు నెలవారీగా చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు నాలుగువేల కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారం వేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు కె.అప్పారావు, కె.సూరయ్య, ఎ.సత్యం, ఎం.గోపి, జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.