ఘనంగా లక్ష్మీగణపతి హోమం

ABN , First Publish Date - 2023-09-27T23:42:27+05:30 IST

విశ్వశాంతిని కాంక్షిస్తు స్థానిక షిర్డీసాయిబాబా ధ్యాన మందిరంలో లక్ష్మీగణపతి హోమాన్ని బుధవారం నిర్వహించారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా చివరిరోజు విశేష పూజలు చేసి హోమం, పూర్ణాహుతి చేపట్టారు.

ఘనంగా లక్ష్మీగణపతి హోమం
నరసన్నపేట: గణనాథుని ఊరేగింపుగా తీసుకు వెళుతున్న సినీ నటుడు ప్రభాస్‌ శ్రీను తదితరులు

పలాస: విశ్వశాంతిని కాంక్షిస్తు స్థానిక షిర్డీసాయిబాబా ధ్యాన మందిరంలో లక్ష్మీగణపతి హోమాన్ని బుధవారం నిర్వహించారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా చివరిరోజు విశేష పూజలు చేసి హోమం, పూర్ణాహుతి చేపట్టారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం గణనాథుని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో గ్రామస్థులతో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు.

రూ.1.5 లక్షల ధర పలికిన గణేష్‌ లడ్డూ

పలాస: స్థానిక వైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్‌ మండపంలో బుధవారం లడ్డూ ప్రసాదాన్ని వేలం నిర్వహిం చారు. ఆ సంఘ గౌరవాధ్యక్షుడు మల్లా భాస్కరరావు రూ.1.5 లక్షల కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్‌ లడ్డూ తనకు లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, దీనిని అందరికీ పంచిపెడతానన్నారు. కార్యక్రమంలో వ్యాపారవేత్తలు కొత్తకోత తిరుమలరావు, మల్లా సురేష్‌ కుమార్‌, తంగుడు కనకరాజు, శరత్‌, చిరంజీవి, భార్గవ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక సీతా రామాలయంలో గణేష్‌ లడ్డూ వేలంలో రూ.50 వేలకు యూత్‌ కమిటీ సభ్యులు దక్కించు కున్నారు. కార్యక్రమంలో మందిర అధ్యక్షుడు తంగుడు హరి, కార్యదర్శి గిన్ని జయశంకర్‌రెడ్డి, పుట్టా లోకనాథం పాల్గొన్నారు.

నందిగాం: మండలంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా బుధవారం పలు గ్రామాల్లో స్వామికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. నందిగాం మెయిన్‌ ప్రాథమిక పాఠశాల వీధి, బంజీరుపేట, తెంబూరు తదితర గ్రామాల్లో గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించా రు.

నరసన్నపేట: గణేశ నవరాత్రుల సందర్భంగా బుధవారం పలు గ్రామాల్లో స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగించి నిమజ్జనం చేశారు. పట్టణంలోని నాయుడు వీధి- కొత్త వీధిలో జరి గిన గణేశుని నిమజ్జనో త్సవంలో సినీ నటుడు ప్రభాస్‌ శ్రీనుతో పాటు పలువురు మహిళలు, ఉత్సవ నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జమ్ము, కంబకాయి, మాకివలస, ఉర్లాం, నడగాం, బొరిగివలస తదితర గ్రామాల్లో వినాయకుని నిమజ్జనం అంగరంగ వైభవంగా చేపట్టారు.

జలుమూరు (సారవకోట): అవలింగి గ్రామంలో విజయ గణపతిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. క్షీరాభిషేకం అనంతరం పుష్పాలంకరణ చేశారు.

Updated Date - 2023-09-27T23:42:27+05:30 IST