Share News

ఘనంగా లక్ష పుష్పార్చన

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:53 PM

స్థానిక గోపినాథపురం సమీపంలోని శ్రీ మేధా దక్షిణమూర్తి లలితాదేవి ఆలయంలో ఆదివారం అమ్మవారికి లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు.

ఘనంగా లక్ష పుష్పార్చన
పుష్పార్చనలో పాల్గొన్న మహిళలు

టెక్కలి రూరల్‌: స్థానిక గోపినాథపురం సమీపంలోని శ్రీ మేధా దక్షిణమూర్తి లలితాదేవి ఆలయంలో ఆదివారం అమ్మవారికి లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ తృతీయ వార్షికోత్సవం సంద ర్భంగా రెండు రోజుల పాటు జరగనున్న విశేష పూజల్లో భాగంగా లక్ష పుష్పార్చన లో మహిళలు పాల్గొన్నారు. సోమవారం అపిత కుచాంబ సహిత అరుణాచలేశ్వర స్వామి కల్యాణంతో పాటు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ చేపడుతున్నట్లు అర్చకులు మావడి నాగరాజు శర్మ తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 11:53 PM