Share News

పోలీసుల అదుపులో కీలకవ్యక్తి?

ABN , First Publish Date - 2023-12-11T00:18:11+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గార ఎస్‌బీఐ బ్యాంకు లో బంగారు ఆభరణాల మాయం కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

పోలీసుల అదుపులో కీలకవ్యక్తి?

- గార ఎస్‌బీఐలోని బంగారు ఆభరణాల మాయం కేసులో పురోగతి

శ్రీకాకుళం క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గార ఎస్‌బీఐ బ్యాంకు లో బంగారు ఆభరణాల మాయం కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో మొత్తం తొమ్మిది మంది పై కేసు నమోదు చేయగా, ఒకరు మృతి చెందగా.. ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కీలక వ్యక్తి పోలీసులకు పట్టుబడడంతో ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాగా ఈ బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టిన 7.146 కిలోల బంగారు ఆభరణాలు మాయం కాగా, పోలీసులు వారం రోజుల్లో రికవరీ చేసిన విషయం విధితమే.

Updated Date - 2023-12-11T00:18:13+05:30 IST