కె.మత్స్యలేశం బీచ్‌లో విద్యార్థి గల్లంతు
ABN , First Publish Date - 2023-09-20T00:15:54+05:30 IST
మండలంలోని కె.మత్స్యలేశం బీచ్‌లో మంగళవారం సాయంత్రం పదో తరగతి విద్యార్థి కూన ప్రవీణ్ (15) గల్లంతయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... ఆమదాలవలసలోని కృష్ణాపురానికి చెందిన కూన ప్రవీణ్ తన తల్లి ఉషారాణి బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానానికి వెళ్ళిన ప్రవీణ్ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గార సీఐ ఎస్.కామేశ్వరరావు, సిబ్బంది కళింగపట్నం మెరైన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ తండ్రి ప్రసాద్ ఏడాదిన్నర కిందట మరణించారు. సోదరుడు కార్తీక్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తల్లి ఉషారాణి రాగోలులో ప్రైవేటు ఆసుప్రతిలో పనిచేస్తున్నారు.ప్రవీణ్ తల్లి ఉషారాణి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

గార: మండలంలోని కె.మత్స్యలేశం బీచ్‌లో మంగళవారం సాయంత్రం పదో తరగతి విద్యార్థి కూన ప్రవీణ్ (15) గల్లంతయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... ఆమదాలవలసలోని కృష్ణాపురానికి చెందిన కూన ప్రవీణ్ తన తల్లి ఉషారాణి బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానానికి వెళ్ళిన ప్రవీణ్ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గార సీఐ ఎస్.కామేశ్వరరావు, సిబ్బంది కళింగపట్నం మెరైన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ తండ్రి ప్రసాద్ ఏడాదిన్నర కిందట మరణించారు. సోదరుడు కార్తీక్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తల్లి ఉషారాణి రాగోలులో ప్రైవేటు ఆసుప్రతిలో పనిచేస్తున్నారు.ప్రవీణ్ తల్లి ఉషారాణి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.