జై చెవిటమ్మ తల్లీ
ABN , First Publish Date - 2023-05-02T00:04:13+05:30 IST
సారవకోట మండలం కిన్నెరవాడలో మంగళవారం చెవిటమ్మతల్లి సిరిమానోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జలుమూరు మండలం కొమనాపల్లి పంచాయతీ కత్తిరివానిపేటలో సిరిమాను చెట్టుకు గ్రామస్థులు పూజలు చేశారు.
- కిన్నెరవాడలో నేడు సిరిమానోత్సవం
సారవకోట (జలుమూరు), మే 1: సారవకోట మండలం కిన్నెరవాడలో మంగళవారం చెవిటమ్మతల్లి సిరిమానోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జలుమూరు మండలం కొమనాపల్లి పంచాయతీ కత్తిరివానిపేటలో సిరిమాను చెట్టుకు గ్రామస్థులు పూజలు చేశారు. అనంతరం 40 అడుగుల పొడవు గల సిరిమానును పది కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు. మంగళ వాయిద్యాలతో బుడితి, అవలింగి, చీడిపూడి గ్రామాల మీదుగా కిన్నెరవాడ గ్రామానికి తరలించారు. మంగళవారం మెండ దాలెప్పన్న సిరిమానును అధిరోహించనున్నారు. సిరిమాను ఊరేగింపులో కాళీమాత వేషధారణలు, బిందెల నృత్యంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ కమిటీ అధికార ప్రతినిధి ధర్మాన తేజకుమార్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, తాగునీటిని అందజేశారు.