‘జగనన్న సురక్ష’ నిర్వహించే పద్ధతి ఇదేనా?

ABN , First Publish Date - 2023-10-06T23:24:36+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా అమలు చేస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించే పద్ధతి ఇదేనా అని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఎంపీడీవో ప్రేమలీలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇజ్ఞువరంలో శుక్రవారం జగనన్న సుర క్ష కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అయితే ఈ కార్యక్ర మాన్ని ఇరుకు ప్రదేశంలో ఏర్పాటు చేయడా న్ని గమనించి వచ్చిన రోగులకు పరీక్షలు, మందుల పంపిణీ ఒకే ప్రాం తంలో ఏర్పాటు చేయడంతో గందగగోళంగా తయారైన విష యాన్ని గమనించి ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు.

 ‘జగనన్న సురక్ష’ నిర్వహించే పద్ధతి ఇదేనా?
సంతబొమ్మాళి: వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌బీ లఠ్కర్‌

సంతబొమ్మాళి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా అమలు చేస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించే పద్ధతి ఇదేనా అని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఎంపీడీవో ప్రేమలీలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇజ్ఞువరంలో శుక్రవారం జగనన్న సుర క్ష కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అయితే ఈ కార్యక్ర మాన్ని ఇరుకు ప్రదేశంలో ఏర్పాటు చేయడా న్ని గమనించి వచ్చిన రోగులకు పరీక్షలు, మందుల పంపిణీ ఒకే ప్రాం తంలో ఏర్పాటు చేయడంతో గందగగోళంగా తయారైన విష యాన్ని గమనించి ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. విశాల మైన స్థలంలో ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏయే పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నా యని వైద్యులను అడిగి తెలుసు కున్నారు. కార్యక్రమంలో టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, సర్పంచ్‌ లావణ్య, పంచాయతీ కార్యదర్శి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-06T23:24:36+05:30 IST