Share News

ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Dec 14 , 2023 | 12:29 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో అంగన్‌ వాడీ సిబ్బంది కోసం నిర్వహిస్తున్న ఆరు నెలల ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఎచ్చెర్ల: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో అంగన్‌ వాడీ సిబ్బంది కోసం నిర్వహిస్తున్న ఆరు నెలల ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. దరఖాస్తు రుసం రూ.250 చెల్లించి వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వర్సిటీ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ బీఆర్‌ఏయూ డాట్‌ ఈడీయూ డాట్‌ ఇన్‌లో దరఖా స్తు నమూనా, దరఖాస్తు చేసే విధానం, కోర్సు సిలబస్‌ తదితర సమాచారం అందుబాటులో ఉంచామన్నారు. అలాగే రూ.18 కోట్లతో నిర్మించిన బాలుర హాస్టల్‌ను గురు వారం జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారని తెలిపారు.

Updated Date - Dec 14 , 2023 | 12:29 AM