తాడివలస కార్యదర్శిపై విచారణ
ABN , First Publish Date - 2023-09-22T00:04:41+05:30 IST
తాడివలస పంచాయతీ కార్యదర్శి వెంకటరావు ఇంటి పన్నులు పంచాయతీ ఖాతాకు జమచేయకుండా అవకతవకలకు పాల్పడ్డారం టూ తాడివలస గ్రామానికి చెందిన చిగులపల్లి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎంపీడీవో సీపాన హరిహరరావు గురువారం విచారణ చేపట్టారు.
పొందూరు, సెప్టెంబరు 21: తాడివలస పంచాయతీ కార్యదర్శి వెంకటరావు ఇంటి పన్నులు పంచాయతీ ఖాతాకు జమచేయకుండా అవకతవకలకు పాల్పడ్డారం టూ తాడివలస గ్రామానికి చెందిన చిగులపల్లి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎంపీడీవో సీపాన హరిహరరావు గురువారం విచారణ చేపట్టారు. సచివాలయం కా ర్యాలయంలో ఫిర్యాదుదారుడు, గ్రామస్థుల సమక్షంలో కార్యదర్శిని విచారించారు. నా లుగు విడతల్లో సుమారు రూ.56 వేలు ఖాతాకు జమ చేశానని కార్యదర్శి చెప్పగా, పంచాయతీ బిల్లులు ఇవ్వకుండా ఇంటిపన్ను వసూలు చేశారని గ్రామస్థులు చెప్పా రు. దీనిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగినా స్పందించ లదేని తెలిపారు. నివేదిక ఉన్నతాధికారులకు అందించనున్నట్టు ఎంపీడీవో తెలిపారు.