చంద్రబాబుకు సంఘీభావంగా..
ABN , First Publish Date - 2023-09-18T00:20:49+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. జిల్లాలో టీడీపీ రిలే నిరాహార దీక్షలు కొన సాగుతున్నాయి. ఆదివారం జిల్లావ్యాప్తంగా చర్చిల్లో చంద్ర బాబునాయుడుకి మద్దతుగా టీడీపీ నాయకులు, కార్య కర్తలు, క్రైస్తవులు ప్రార్థనలు చేశారు.

- 9261292612కు మిస్డ్ కాల్ ఇవ్వండి
- మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
- జిల్లాలో కొనసాగుతున్న రిలే దీక్షలు
అరసవల్లి, సెప్టెంబరు 17: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. జిల్లాలో టీడీపీ రిలే నిరాహార దీక్షలు కొన సాగుతున్నాయి. ఆదివారం జిల్లావ్యాప్తంగా చర్చిల్లో చంద్ర బాబునాయుడుకి మద్దతుగా టీడీపీ నాయకులు, కార్య కర్తలు, క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. శ్రీకాకుళం 80 అడు గుల రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద నగర తెలుగు యువత ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వ హించారు. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో పెద్దమార్కెట్‌లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ నిర్ణ యాలతో ప్రజలు పడుతున్న బాధలు, రాబోయే ఇబ్బందులను లక్ష్మీదేవి వివరించారు. చంద్రబాబుకు సం ఘీభావంగా.. 9261292612కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని ఆమె కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా విద్యార్థులు, యువతలో వ్యక్తిగత నైపుణా ల్యను మెరుగుపరచి, ఉన్నత ఉద్యోగావకాశాలు కల్పించ డమే చంద్రబాబునాయుడు చేసిన నేరమా? అని ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు, దాడులు ప్రజా బలం ముందు నిలబడవని తెలిపారు. నిరంతం ప్రజా సంక్షేమం కోసం పరితపించే చంద్రబాబునాయుడికి రాష్ట్ర ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు చింతల రామకృష్ణ, నగరపార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, టీడీపీ నేతలు కొర్ను నాగార్జున ప్రతాప్, సింతు సుధాకర్, ప్రధాన విజయరాం, కొమ్మనాపల్లి వెంకటరామరాజు, విభూది సూరిబాబు, రోణంకి కళ్యాణ్, మీడియాసెల్ కన్వీనర్ బుక్కా యుగంధర్, కవ్వాడి.సుశీల, పెద్ద ఎత్తున తెలుగు యువత పాల్గొన్నారు.
చిక్కాలవలస నుంచి అరసవల్లికి పాదయాత్ర
నరసన్నపేట: చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులకు వ్యతిరేకంగా చిక్కాలవలస సర్పంచ్ శ్రీరాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆదివారం చిక్కాలవలస నుంచి కోమర్తి జంక్షన్ మీదుగా ఉర్లాం, దేవాది, మడపాం మీదుగా అరసవల్లికి పాదయాత్రగా వెళ్లారు. 43 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి అరసవల్లిలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వీరికి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంఘీభావం తెలిపారు.