అభివృద్ధి పనులు వేగవంతం

ABN , First Publish Date - 2023-06-03T00:13:20+05:30 IST

స్థానిక సూదికొండ కాలనీ వద్ద నివాస ప్రాంతాల్లో కంకరను అక్రమంగా తవ్వి తరలిస్తుండడంపై స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక నేతలు కంకరను తరలిస్తున్నా అధికారులు పట్టించు కోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొండ చుట్టూ ఉన్న కంకరను తవ్వి తరలించగా తాజాగా పునాదుల్లో కంకర నిం పేందుకు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వుకుంటున్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం
సూదికొండపై నివాస ప్రాంతాల్లో కంకరను తరలించిన దృశ్యం

పలాస, జూన్‌ 2: స్థానిక సూదికొండ కాలనీ వద్ద నివాస ప్రాంతాల్లో కంకరను అక్రమంగా తవ్వి తరలిస్తుండడంపై స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక నేతలు కంకరను తరలిస్తున్నా అధికారులు పట్టించు కోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొండ చుట్టూ ఉన్న కంకరను తవ్వి తరలించగా తాజాగా పునాదుల్లో కంకర నిం పేందుకు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వుకుంటున్నారు. రోడ్లు వేసిన ప్రాంతంలోని కంకరను తవ్వు కు వెళ్లిపోతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై స్థానిక నాయకుడిని ప్రశ్నిస్తే రోడ్డు వేస్తామని చెబుతు న్నారని, అయితే దీనిని గృహ అవసరాలకు ఎలా తరలిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులపై అధికా రులు స్పందించే వరకు తమ పోరాటం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహిస్తామని స్థానిక యువత హెచ్చ రిస్తున్నారు కంకరను అక్రమంగా తరలిస్తుండడంపై ఆర్‌ఐ రవికుమార్‌ను వివరణ కోరగా కంకరను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2023-06-03T00:13:20+05:30 IST