చంద్రబాబును హతమార్చడానికే అక్రమ అరెస్టు
ABN , First Publish Date - 2023-09-18T00:20:28+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును హతమార్చడా నికే అక్రమంగా అరెస్టుచేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు.

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్
సరుబుజ్జిలి, సెప్టెంబరు 17: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును హతమార్చడా నికే అక్రమంగా అరెస్టుచేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు. ఆదివారం ఆమదాల వలసలో టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న రిలేదీక్ష శిబిరా నికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఎస్‌పీజీ భద్రత లేకపోతే ఏనాడో క్లోజ్ చేసేవారమని స్పీకర్ తమ్మినేని సీతారాం గతంలో అన్నారని గుర్తుచేశారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించే సమావేశాలు, ర్యాలీల్లో రాళ్లు దాడి చేశారని తెలిపారు. కార్యక్ర మంలో పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, మొదలవలస రమేష్, నూకరాజు, నాయ కులు బోర గోవిందరావు, మురళీధరరావు, కొండబాబు, బొడ్డేపల్లి విజయ్ కుమార్, భాస్కరరావు, ఢిల్లీ, మనోజ్ పాల్గొన్నారు. సరుబుజ్జిలిలోని పెంతు కోస్తు చర్చిలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావాలని టీడీపీ నాయకులు ఆదివారం ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి గుర్రాల చిన్నబాబు, నాయకులు కొమనాపల్లి రవికుమార్, కొర్ను సూర్యనారాయణ, రాజారావు పాల్గొన్నారు.
- ఎచ్చెర్ల: అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైన వైసీపీని రానున్న ఎన్నికల్లో సాగనంపుదామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్ నాయుడు పిలుపు నిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎచ్చెర్లలోనిపాఆర్టీ కార్యాలయం వద్ద తెలుగు మహిళలతో కలిసి ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మ హిళా కార్యదర్శి ముప్పిడి సుజాత, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు బల్లాడ అరుణ, నియోజకవర్గ అధ్యక్షురాలు గొర్లె కుమారి, ఎచ్చెర్ల మండల పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు పప్పల రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుగు మహిళలంతా నోటికి నల్ల రిబ్బన్ ధరించి వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు.
- అరసవల్లి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, అక్రమ కేసుల నుంచి బయటపడేయాలని కోరుతూ అరసవల్లి సూర్యనారాయ ణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూస పాటిరేగ మండలం గుంపాం గ్రామానికి చెందిన బ్రాహ్మణ సాధికార కమిటీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఇనుగంటి రాకేష్‌శర్మ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. హోమం, 108 కొబ్బరి కాయలతో అర్చన చేశారు. కార్యక్రమంలో 20 మంది అభిమానులు పూజల్లో పాల్గొన్నారు.
- రణస్థలం: చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, లోకేష్‌కు ఎదురైన ఆటంకాలు తొలగిపోవాలని కోరుతూ ఆదివారం పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో డబ్ల్యూఎంసీ చర్చిలో క్రైస్తవులతో కలిసి ప్రార్థనలు చేశారు.
- ఇచ్ఛాపురం: చంద్రబాబును రాజకీయకక్షతోనే సీఎం జగన్‌రెడ్డి అక్ర మంగా అరెస్ట్ చేయించడంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజాగ్రహం వ్యక్తమవుతోం దని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. ఆదివారం ఇచ్ఛాపురం పాత బస్టాండ్ జంక్షన్‌లో బాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా చేపట్టిన రిలేదీక్ష లు ఐదో రోజుకు చేరారు. ఈ సందర్భంగా కంచిలి మండలానికి చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లగా రాష్ట్రానికి దరిద్రం పట్టిపీడిస్తోందన్నారు. ప్రజల బాధలు పట్టించుకొనే పాలకుడే లేరన్నారు. కార్యక్రమంలో కంచిలి మండల నాయకులతోపాటు రాష్ట్ర బీసీ సాధికార సమితి కన్వీనర్ కొండా శంకరరెడ్డి, కౌన్సిలర్లు పత్రి తవిటయ్య, కాళ్ల దిలీప్, తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల జయదేవ్, కార్యదర్శి నందికి జాని, లీలారాణి, కొరాయి ధర్మరాజు, రెయ్యి, జానికిరావు, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, డి.కామేష్ పాల్గొన్నారు.
- కంచిలి: కంచిలిలోని చర్చిలో ఆదివారం టీడీపీ నాయకులు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు బెయిల్ మంజూరుకావాలని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బంగారు కురయ్య, జగదీష్ పట్నాయక్, మురళీమోహన్ పట్నాయక్, పైల పురుషోత్తం రెడ్డి, సర్పంచ్ లండ లక్ష్మి, ఎంపీటీసీ యమున పాల్గొన్నారు.
- కాశీబుగ్గ: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజు ఆదివారం కొనసాగాయి. కాశీబుగ్గలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు తెలుగు మహిళా ప్రతినిధులు, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, రానున్న రోజుల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. కార్యక్రమం లో మాజీ మంత్రి గౌతు శివాజీ సతీమణి గౌతు విజయలక్ష్మి, నాయకులు వజ్జ బాబురావు, లొడగల కామేశ్వరరావు యాదవ్, విఠల్, బి.నాగరాజు, గాలి కృష్ణారావు, వజ్జ గంగాభవాని, సూర్యనారాయణ, కె.యుగంధర్, సురేష్‌కుమార్, రవిశంకర్ గుప్తా, నర్సింగులు, మల్లి, మురళీకృష్ణ, శ్రీనివాస్, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
- కోటబొమ్మాళి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తోడుగా మేము న్నామని, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని తెలుగుయువత జిల్లా అధ్యక్షు డు మెండ దాసునాయుడు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయం ఆవరణలో తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఫ్, ఐటీడీపీ నిర్వహించిన సామూహిక నిరాహార దీక్షలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఎలాంటి తప్పుచేయని చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమంగా జైలుకు పంపిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుయువత వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బోయిన రమేష్, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, తర్ర రామకృష్ణ, గొండు లక్ష్మణరావు, కర్రి అప్పారావు, నాలుగు మండలాల తెలుగుయువత అధ్యక్షులు కూచెట్టి భాను ప్రకాష్, తూలుగు మహేష్, కోళ్లకామేశ్వర రావు, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఐటీడీపీ ప్రతినిధులు పాల్గొన్నారు.
- నరసన్నపేట: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ధోషి అని అలాంటి వ్యక్తిపై బురద చల్లి జైలుకు పంపడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం స్థానిక పెద్దపేట వద్ద చర్చిలో క్రైస్తవు లతో కలిసి ప్రార్థనలు చేశారు. ఫాదర్స్ కాలేబు, చిన్నవాడు చంద్రబాబు కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఉణ్న వెంకటేశ్వరరావు, పీస కృష్ణ, శిమ్మ చంద్ర శేఖర్, కింజరాపు రామారావు, బెవర శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
- జలుమూరు (సారవకోట): రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపించిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సారవకోటలో చేపట్టిన నిరాహార దీక్షలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రతినిధి ధర్మాన తేజ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, మహంతి చిన్నంనాయుడు, సురవరపు తిరుపతిరావు, చిన్నికృష్ణంనాయుడు, పట్ట ఉమారావు, కోన వెంకటేష్, తాడేల భీమారావు పాల్గొన్నారు.
- మెళియాపుట్టి: టీడీపీ అధినేత చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ రట్టిణి గ్రామంలో జనసేన నేతలు ఆదివారం మౌనదీక్ష చేపట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రశాంత్, కిషోర్, పవిత్ర సామ్యూ ల్, ప్రసాద్‌పాణిగ్రహి, చంద్రదాస్ తదితరులు పాల్గొన్నారు.
- పాతపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి అన్నారు. పాతపట్నంలో చేపట్టిన నిరసన దీక్షలు ఐదో రోజు ఆదివారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూడలేకే వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్, హిరమండలం జడ్పీటీసీ బుచ్చిబాబు, హిరమండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే స్థానిక జేసీఎండ్‌ఈఎం చర్చిలో చంద్రబాబునాయుడును విడుదల చేయాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సాగర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సతీష్ పాల్గొన్నారు.
ఎస్‌ఎం పురంలో కొవ్వొత్తుల ర్యాలీ
ఎచ్చెర్ల: టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎస్‌ఎం పురం గ్రామంలో ఆదివారం సాయంత్రం టీడీపీ జిల్లా మాజీ అధ్య క్షుడు చౌదరి నారాయణమూర్తి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించి వైసీపీ నేతలు చెంకలు గుద్దుకుంటున్నారన్నారు. నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ జీవితంలో చంద్రబాబుపై ఒక్క ఆరోపణ కూడా రాలేదన్నారు. ఇప్పుడు కేవలం కక్షసాధింపుల్లో భాగంగానే వైసీపీ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేసిందని, త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చౌదరి అవినాష్, మాజీ ఎంపీటీసీ గొంటి నర్సింగరావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు సంపతిరావు గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.