సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం

ABN , First Publish Date - 2023-08-02T00:04:04+05:30 IST

మునిసిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరిం చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు అన్నారు. మంగళవారం ఆమదాలవలస మునిసిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం
ఆమదాలవలస: నిరసన తెలియజేస్తున్న పారిశుధ్య కార్మికులు

ఆమదాలవలస (పొందూరు): మునిసిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరిం చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు అన్నారు. మంగళవారం ఆమదాలవలస మునిసిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పతిపక్షనేతగా పాదయాత్ర సమయంలో మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన పారిశుధ్య కార్మికులను వైసీపీ ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూనియన్‌ పట్టణ అధ్యక్షుడు తాడి సంతోష్‌కుమార్‌ హెచ్చరించారు. ఇచ్ఛాపురం: సమస్యలు పరిష్క రించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు మంగళవారం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ అంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నాయక త్వం పిలుపు మేరకు కార్యాలయానికి అధికారులు రాకుండా గేటు వద్ద బైఠాయించా రు. మా సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ కె.గోవిందరావు, సిబ్బంది చేరుకుని కార్మికులకు నజ్జజెప్పి గేట్లు తీయడంతో అధికారులు కార్యాలయం లోపలకి వెళ్లి విధులు నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ కూడా బయటనే ఉండిపోయారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:04:04+05:30 IST