షార్ట్‌సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం

ABN , First Publish Date - 2023-03-18T23:53:52+05:30 IST

టెక్కలి పట్టణం ఆంజనేయపురం గ్రామానికి చెందిన ముడిదాన జంగమయ్య నివాసంలో శనివారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో గృహో పకరణాలు దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూట్‌లో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగి దట్టంగా పొగలు వ్యాపించాయి. స్థానికులు స్పందించి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని వస్ర్తాలు, బీరువా, నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రి దగ్ధమైంది. దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని టెక్కలి అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

షార్ట్‌సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం

టెక్కలి రూరల్‌: టెక్కలి పట్టణం ఆంజనేయపురం గ్రామానికి చెందిన ముడిదాన జంగమయ్య నివాసంలో శనివారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో గృహో పకరణాలు దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూట్‌లో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగి దట్టంగా పొగలు వ్యాపించాయి. స్థానికులు స్పందించి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని వస్ర్తాలు, బీరువా, నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రి దగ్ధమైంది. దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని టెక్కలి అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

Updated Date - 2023-03-18T23:53:58+05:30 IST