చరిత్ర ఘనం.. గుర్తింపు శూన్యం

ABN , First Publish Date - 2023-03-31T00:03:45+05:30 IST

స్వాతంత్ర్యోద్యమ సమయంలో జాతిపిత మహాత్మా గాంఽధీ నడయాడిన పూండి రైల్వేస్టేషన్‌కు జిల్లాలోనే ఘనమైన చరిత్ర ఉంది. ఇటువంటి రైల్వేస్టేషన్‌ను ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చరిత్ర ఘనం.. గుర్తింపు శూన్యం
పూండి రైల్వేస్టేషన్‌

- ఎక్స్‌ప్రెస్‌ నిలవని పూండి రైల్వేస్టేషన్‌

- మూడు మండలాల ప్రజలకు తప్పని ఇబ్బందలు

వజ్రపుకొత్తూరు: స్వాతంత్ర్యోద్యమ సమయంలో జాతిపిత మహాత్మా గాంఽధీ నడయాడిన పూండి రైల్వేస్టేషన్‌కు జిల్లాలోనే ఘనమైన చరిత్ర ఉంది. ఇటువంటి రైల్వేస్టేషన్‌ను ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఎంత చరిత్ర ఉన్నా గుర్తింపులేకుండా పోయిందని స్థానికులు అభిప్రాప డుతున్నారు. వజ్రపుకొత్తూరు, నందిగాం, సంతబొమ్మాళి మండలాల ప్రజలకు ఎంతో అనుకూలమైన ఈ స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ లేకపోవడంపై నిరుత్సా హపడుతున్నారు. ఈ విషయమై అధికారులకు, నాయకులకు వినపత్రాలు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకపోతుంది. ఈ మూడు మండలాల ప్రజలకు ఎంతో అనూ లమైన ఈ స్టేషన్‌పై రైల్వే అధికారులు శీతకన్ను వేశారు. ప్రస్తుతం డీఎంయూతో పాటు తిరుపతి-పూరి రైళ్లు మాత్రమే పూండి స్టేషన్‌లో నిలుపుదల చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి నిత్యం హైదరాబాద్‌, ముంబాయి, ఆహ్మదాబాద్‌, అస్సాం తదితర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళుతుంటారు. వీరంతా పలాస, శ్రీకాకుళం స్టేషన్లకు వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తుంది. కనీసం ఇంటర్‌సిటీ, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అయినా నిలపాలని కోరుతున్నప్పటికీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. దీంతో పలాస స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రయాణాలతో తీవ్ర అసౌఖ్యరానికి గురువుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన పూండి స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ నిలుపదలపై అధికారులు చొరవచూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కుర్థా రోడ్డు డివిజన్‌లో పూండి స్టేషన్‌ ఉండడం కూడా ప్రతికూల అంశగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూండి రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలుపేదలకు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

రైల్వే అధికారులకు విన్నవించాం

పూండిస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలుపుదల కోసం ఎంపీ రామ్మోహన్‌నాయుడితో కలిసి రైల్వే ఉన్నతాధికారులను కలిశాం. ఎంపీ సాయంతో పూండి రైల్వే స్టేషన్‌ అభివృద్ధి చేసుకోవడమే కాకుండా పాసింజర్‌ రైలు కూడా నిలుపుదలకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలుపుదలకు అధికారుల నుంచి సానుకూల స్పందన లభిం చింది. త్వరలో మరిన్ని రైళ్లు నిలిచే అవకాశం ఉంది. ఈ విషయంమై మరోసారి ఎంపీ సాయంతో రైల్వే అధికారులను కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం.

- పుచ్చ ఈశ్వరరావు, పూండి గోవిందపురం

Updated Date - 2023-03-31T00:03:45+05:30 IST